- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలకు పుట్టినింటి ‘ఇంటిపేరు’.. కోర్టుకు చేరిన వ్యవహారం
దిశ, నేషనల్ బ్యూరో : పుట్టినింటి నుంచి సంక్రమించిన ఇంటి పేర్లను ఉపయోగించేందుకు వివాహిత మహిళలకు వెసులుబాటును కల్పిస్తూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేవలం మహిళలకు మాత్రమే ఈవిధమైన వెసులుబాటును కల్పించడం వివక్షా పూరితమైన నిర్ణయమని పిటిషనర్ దివ్య మోడీ వాదించారు. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. దీనిపై గురువారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం మే 28కి వాయిదా వేసింది. వివాహిత మహిళ తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఇంటిపేరును ఉపయోగించాలని భావిస్తే విడాకుల డిక్రీ లేదా భర్త నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను పొందాలని ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు.