CNG, PNG గ్యాస్ ధరలను తగ్గించిన ప్రభుత్వం..

by Mahesh |
CNG, PNG గ్యాస్ ధరలను తగ్గించిన ప్రభుత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: CNG, PNG గ్యాస్ ధరలను ఢిల్లీ ప్రభుత్వం తగ్గించింది. సహజ వాయువు ధరల సూత్రాన్ని ప్రభుత్వం సవరించిన తర్వాత, రెండేళ్లలో మొదటిసారిగా ఢిల్లీలో CNG, పైప్డ్ వంట గ్యాస్ ధరలు (PNG) వరుసగా ₹6 , ₹5 తగ్గాయి. CNG ధర ఇప్పుడు కిలోకు ₹73.59 కాగా, పైప్డ్ నేచురల్ గ్యాస్ స్టాండర్డ్ క్యూబిక్ మీటరుకు ₹48.59 ఖర్చవుతుందని ఢిల్లీలో వాటిని రిటైల్ చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది. ఈ ధరల తగ్గింపుతో గ్యాస్‌తో నడిచే వాహన దారులకు కాస్త ఊరట లభించిందని చెప్పుకొవాలి.

Advertisement

Next Story