Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 58 ఏళ్ల తరువాత ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కేంద్రం

by Shiva |
Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 58 ఏళ్ల తరువాత ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం సర్వీసుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదంటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎత్తివేసింది. ఈ పరిణామంతో దాదాపు 58 ఏళ్ల అనంతరం సంఘ్ సేవలకు దూరమైన ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించనట్లైంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. కానీ, నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ కాపీని ఆయన జతపరచలేదు. కాగా, గాంధీజీ హత్య అనంతరం ఫిబ్రవరి, 1948లో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌పై తాత్కాలికంగా నిషేధం విధించారు. అనంతరం జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ నాగ్‌పూర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా నిరసన తెలిపింది. ఆ తదనంతర పరిణామాలతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా 1966లో నిషేధం విధించారు.

Advertisement

Next Story