ముఖ్యమంత్రి సభకు నిప్పు.. రాష్ట్రంలో హై అలర్ట్

by samatah |
ముఖ్యమంత్రి సభకు నిప్పు.. రాష్ట్రంలో హై అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : మణిపూర్ రాష్ట్రం హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని చురాచంద్రపూర్ జిల్లాలో నేడు సీఎం ఎన్ బీరేన్ సింగ్ పర్యటించి, అక్కడే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సీఎం పాల్గొనే సభావేదికకు నిప్పు పెట్టారు. వేదిక మొత్తం మంటల్లో దగ్ధమైంది. దీంతో అలర్టైన రాష్ట్ర ప్రభుత్వం చురాచంద్రపూర్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి, హై అలర్ట్ ప్రకటించింది. అలాగే ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed