మహిళలకు గుడ్ న్యూస్.. ఇక బస్సుల్లో ఉచిత ప్రయాణం

by Sathputhe Rajesh |
మహిళలకు గుడ్ న్యూస్.. ఇక బస్సుల్లో ఉచిత ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి మహిళా ప్రయాణికులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ విషయమై చర్చ సాగింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తు్న్నారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ప్రకటించారు. బస్సుల్లో ప్రయాణించేందుకు ఎలాంటి వర్గీకరణ లేదన్నారు. కాబట్టి మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులన్నారు. ఈ స్కీంకు సంబంధించిన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు అందిస్తామన్నారు.

Advertisement

Next Story