- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మధ్యంతర బడ్జెట్‌లో నాలుగు ఆంశాలపై దృష్టి సాధించామని.. అందులోని అన్ని పథకాలు ప్రస్తుతం కొనసాగిస్తున్నామని.. ఈ క్రమంలోనే రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించే ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని ఐదేళ్ల పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ లో మొత్తం తొమ్మిది రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ప్రకటించారు. అలాగే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని.. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి కోసం క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.