Gold seize: హర్యానాలో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ ఎంతంటే?

by vinod kumar |
Gold seize: హర్యానాలో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ ఎంతంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని అంబాలాలో అమృత్‌సర్-హౌరా ట్రెయిన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) రూ. 4.5 కోట్ల విలువైన సుమారు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. నలుగురు ప్రయాణికుల వద్ద ఈ బంగారాన్ని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఆర్పీఎఫ్ అధికారి జావేద్ ఖాన్ నేతృత్వంలోని బృందం రైలులో సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికులను గమనించి వారి బ్యాగుల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే నలుగురి వద్ద భారీగా బంగారాన్ని గుర్తించారు. దీనిని సీజ్ చేసి అంబాలా కాంట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్‌లో రైల్వే చట్టంలోని సెక్షన్ 146 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కాగా, ఇటీవల అగర్తలా రైల్వే స్టేషన్‌లో రహస్య సమాచారం ఆధారంగా అగర్తల ప్రభుత్వ రైల్వే పోలీస్, ఆర్‌ఫీఎఫ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 100 నకిలీ దగ్గు సిరఫ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి బంగారం పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story