గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలు దుర్మరణం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-17 16:53:37.0  )
గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఇవాళ గణేష్ నిమజ్జన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. గణపతి ఊరేగింపునకు ముందు ట్రాక్టర్‌ను ముస్తాబు చేశారు. శోభాయాత్ర ప్రారంభానికి ఆలస్యం అవుతుందని డ్రైవర్ కాసేపు బయటకు వెళ్లాడు. ఇంతలో మరో వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను స్టార్ట్ చేశాడు. అది కాస్త రివర్స్ వెళ్లి ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తితో పాటు డ్రైవర్‌ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులు వెతికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story