- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SIPRI: యుద్ధాల ఎఫెక్ట్.. 2023లో రూ.53 లక్షల కోట్ల ఆయుధ వ్యాపారం
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, ఇతర ప్రాంతీయ ఉద్రిక్తతలతో ఆయుధాల విక్రయాలు జోరుగా సాగాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చే (SIPRI) నివేదికలో తేలింది. సంక్షోభాల వల్ల ఆయుధవ్యాపార కంపెనీలకే ఎక్కువగా లాభపడినట్లు చెప్పుకొచ్చింది. ప్రపంచంలోని 100 ఆయుధ కంపెనీలు 2023లో ఏకంగా 632 బిలియన్ డాలర్ల (రూ. 53 లక్షల కోట్ల) వ్యాపారం చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.2శాతం అధికమని పేర్కొంది. 2022లో చాలా ఆయుధ కంపెనీలకు కనీస డిమాండ్ కూడా లేదని తెలిపింది. కానీ, ఏడాదిలోగా పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పుకొచ్చింది. ఆ కంపెనీలు ఆయుధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సి వచ్చిందంది.
2024లోనూ ఇదే ట్రెండ్
దాదాపు 100 ఆయుధ కంపెనీలకు 2023లో కనీసం 1 బిలియన్ డాలర్లు (రూ.8.4 వేల కోట్లకు) పైగా వ్యాపారం జరిగినట్లు సిప్రి నివేదికలో బయటపడింది. 2024లోనూ కూడా ఆయుధాల ఉత్పత్తి ఇలాగే కొనసాగుతోందని సిప్రి పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కంపెనీలు వాటి డిమాండ్‌ను ఇప్పటివరకు అందుకోలేకపోయాని పేర్కొంది. వాటిల్లో చాలా సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయన్నారు. ఇక ప్రపంచంలోని భారీ 100 కంపెనీల్లో 41 సంస్థలు అమెరికాలో ఉన్నాయి. కాగా.. ఆయుధ విక్రయాల్లో అమెరికా కంపెనీలు 2.3 వృద్ధి సాధించాయి. ఇక, యూరప్ లో 27 భారీ సంస్థలు ఉండగా.. కేవలం 0.2 శాతమే వృద్ధి సాధించాయి. రష్యా కంపెనీలు మొత్తం సగటున 40 శాతం వృద్ధిని పొందాయి. ఇక, మూడు ఇజ్రాయెల్ కంపెనీలు రికార్డు స్థాయిలో 13.6 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపాయి. తుర్కియేకు చెందిన డ్రోన్ల తయారీ సంస్థ బేకర్ 24శాతం వృద్ధి నమోదు చేసింది. చైనా సంస్థల విక్రయాల్లో వృద్ధి లేకపోయినా.. 103 బిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారం చేశాయి.