Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బెయిల్.. జైలు నుంచి బయటకు వస్తాడా?

by Mahesh Kanagandla |
Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బెయిల్.. జైలు నుంచి బయటకు వస్తాడా?
X

దిశ, నేషనల్ బ్యూరో: బొంబాయ్ అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బాంబే హైకోర్టులో ఊరట దక్కింది. దక్షిణ ముంబయి గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసులో చోటా రాజన్‌కు బెయిల్ దక్కింది. ఈ కేసులో ఆయనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. జయ శెట్టి హత్య కేసులో చోటా రాజన్‌ను దోషిగా తేల్చడానికి సరిపడా ఆధారాలు లభించలేవు. దీంతో న్యాయమూర్తులు రేవతి మోహితే, పృథ్విరాజ్ చవాన్‌ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. తిహార్ జైలులో ఉన్న చోటా రాజన్ రూ. 1 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తంలో ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడ్డా చోటా రాజన్ జైలు బయట అడుగు పెట్టలేడు. ఎందుకుంటే జర్నలిస్టు జే డే హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

ముంబయిలోని స్పెషల్ సీబీఐ కోర్టు మే 30వ తేదీన జయ శెట్టి మర్డర్ కేసులో చోటా రాజన్‌తోపాటు మరో ముగ్గురు షూటర్లకు జీవిత ఖైదు విధించింది. జయశెట్టి అడిగినంత మామూళ్లు ఇవ్వకపోవడంతో ఆయనను హత్య చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. చోటా రాజన్ బెదిరింపుల నేపథ్యంలోనే జయ శెట్టికి పోలీసులు భద్రత కల్పించారు. భద్రత ఉపసంహరించిన రెండు నెలల తర్వాత అంటే 2001 మే 4వ తేదీన జయ శెట్టి హత్య జరిగింది. కీలక అనుమానితుడు అజయ్ సురేశ్ మోహితేను స్పాట్‌లోనే ఆయుధాలతోపాటుగా పోలీసులు పట్టుకున్నారు. సహ నిందితుడు కుందన్ సింగ్ రావత్ ఆ తర్వాత పట్టుబడగా.. కేసు విచారణ ముగియడానికి ముందే మరణించాడు. పెరోల్ పై బయటికి వచ్చిన మోహితే ఓ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

యాభై ఏళ్ల క్రితం ముంబయి తూర్పు ప్రాంతంలో బడా రాజన్, చోటా రాజన్‌లకు ఎదురులేదు. అనధికారికంగా ఘాట్‌కోపర్, తిలక్ నగర్, చెంబూరు ఏరియాలు వారి గుప్పిట్లో ఉండేవి. ఎక్స్‌టార్షన్, అక్రమ సరుకు రవాణా, హత్యలు వీరి కను సైగలో జరుగుతుండేవి. ఓ హత్యకు ప్రతీకారంలో భాగంగా బడా రాజన్‌ను హతమయ్యాడు. బడా రాజన్ హత్యతో చోటా రాజన్ కుమిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోసాగాడు. అలాగే, అండర్‌వరల్డ్‌లో తన పట్టు బిగించుకుని, వసూళ్లు, హత్యలు చేయించాడు. ఇలాంటి హత్య కేసుల్లోనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ జైలులో ఉన్నాడు.

Advertisement

Next Story