బాధ్యతలు చేపట్టిన గడ్కరీ, నిర్మలా సీతారామన్..భారత్‌ను వేగంగా తీర్చిదిద్దుతామని హామీ

by vinod kumar |
బాధ్యతలు చేపట్టిన గడ్కరీ, నిర్మలా సీతారామన్..భారత్‌ను వేగంగా తీర్చిదిద్దుతామని హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ 3.0 కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నియామకమైన నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకున్న సీతారామన్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మంగళవారమే బాధ్యతలు స్వీకరించారు. సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరుసగా రెండో సారి కావడం గమనార్హం. 2019లో ఆమె మొదటి సారి బాధ్యతలు స్వీకరించారు.

ఇక, గడ్కరీ వరుసగా మూడోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ స్థాయి, ఆధునిక మౌలిక సదుపాయాలతో భారత్‌ను వేగవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనతో పాటు అజయ్ తమ్టా, హర్ష్ మల్హోత్రా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాగా, ‘హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన గడ్కరీ.. గత పదేళ్లలో దేశంలో 54,858 కిలోమీట్లర్ల కంటే ఎక్కువ జాతీయ రహదారులను నిర్మించారు.

Advertisement

Next Story

Most Viewed