స్టాలిన్, రాహుల్ సైకిల్ ముచ్చట్లు

by M.Rajitha |
స్టాలిన్, రాహుల్ సైకిల్ ముచ్చట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America) పర్యటనలో సరదాగా సైకిల్ తొక్కిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియో మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సరదా కామెంట్లు చేయడం, దానికి స్టాలిన్ రిప్లై ఇవ్వడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని షికాగో సరస్సు ఒడ్డున స్టాలిన్ సైకిల్ తొక్కిన వీడియోను కొత్త కలలకు ఈ సాయంత్ర సమయం వేదిక అవుతోంది' అని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 'మిత్రమా చెన్నై(Chennai) లో మనం ఎప్పుడు సైకిల్ తొక్కుదాం' అన్నారు. దీనికి రిప్లైగా.. డియర్ సోదరా.. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే తొక్కుదాం. ఆ తర్వాత మీరు మా ఇంట్లో దక్షిణాది వంటకాలు రుచి చూడాలి, ముఖ్యంగా స్వీట్లు తినాలి..' అంటూ స్టాలిన్ పేర్కొన్నారు. వీరి ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed