India-Russia: రష్యాతో సంబంధాలపై అమెరికా వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన భారత్

by S Gopi |
India-Russia: రష్యాతో సంబంధాలపై అమెరికా వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు సంబంధించి అమెరికా అధికారి చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. ప్రధాని మోడీ రష్యా పర్యటనకు ఎంచుకున్న సమయం సరైంది కాదని అమెరికా అధికారి అన్న సంగతి తెలిసిందే. దీనికి బదులిస్తూ.. అన్ని దేశాలకు పరస్పరం ద్వైపాక్షిక సంబంధాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. రష్యాతో తమకున్న దీర్ఘకాలిక సంబంధాలను ప్రస్తావించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. భారత్‌కు రష్యాతో పరస్పర ప్రయోజనాలపై ఆధారపడిన సుధీర్ఘ బంధం ఉందని అర్థం చేసుకోవాలి. ఎల్లలులేని ప్రపంచంలో అన్ని దేశాలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాలను గుర్తెరిగి, అభినందించడం చాలా అవసరమని అన్నారు. ఈ వారం ప్రారంభంలో యూఎస్ కాంగ్రెస్ సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఇటీవల మాస్కో పర్యటనపై నిరాశను వ్యక్తం చేశారు.



Next Story