- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో అట్టహాసంగా సాగిన ఫార్ములా-4 కార్ రేసింగ్
దిశ, నేషనల్ బ్యూరో: పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, స్థానిక యువత కెరీర్ కోసం జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఫార్ములా-4 కార్ రేసింగ్ ఈవెంట్ ఆదివారం అట్టహాసంగా జరిగింది. నగరంలోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకు 1.7 కిలోమీటర్ల మేర ఫార్ములా-4 కార్ రేస్ జరిగింది. దీనిలో ప్రఖ్యాత ఫార్ములా డ్రైవర్లు తమ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఈ రేసును చూడటానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు.
ఈవెంట్ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి అధికారులు డ్రోన్ల ద్వారా అదనపు భద్రత కల్పించారు. అలాగే, తగిన భద్రత సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లతో వైద్య బృందాలను మోహరించారు. భారికేడ్లను ఏర్పాటు చేసి భద్రత నడుమ ఈవెంట్‌ను సజావుగా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా రేసింగ్ ఈవెంట్‌ల రంగంలో కాశ్మీర్ ఆదరణ పొందిందని నిర్వాహకులు అన్నారు. స్థానిక యువతను ప్రోత్సహించడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్‌ల సహకారంతో ఈ ఈవెంట్ జరిగింది.