ఒడిశా రైలు ప్రమాదంపై హై లెవల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి.. మాజీ రైల్వే మంత్రి లాలూ

by Javid Pasha |
lalu prasad yadav
X

దిశ, వెబ్ డెస్క్: కోరమండల్ ఎక్స ప్రెస్ ప్రమాదంపై మాజీ రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. బాలాసోర్ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే రైల్వే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రయాణికులు చనిపోవడానికి రైల్వే సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే కారణమని చెప్పారు.

ఈ ప్రమాదంపై హైలెవల్ కమిటీతో ఎంక్వైరీ చేయించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైల్వే శాఖను నాశనం చేసిందని లాలూ మండిపడ్డారు. కాగా బాలాసోర్ రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చనిపోగా 1000 మందికి పైగా గాయపడ్డారు.

Advertisement

Next Story