మాజీ క్రికెటర్ సిద్దూ సతీమణికి క్యాన్సర్

by Shiva |
మాజీ క్రికెటర్ సిద్దూ సతీమణికి క్యాన్సర్
X

దిశ, వెబ్ డెస్క్: భార‌త మాజీ క్రికెట‌ర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కు రెండో స్టేజ్ ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిన‌ట్లు ఆమె ట్విట్టర్‌లో వార్తను పంచుకున్నారు. దీంతో జైలులో ఉన్న భర్తను ఉద్దేశిస్తూ ఎమోష‌న‌ల్ పొస్ట్ పెట్టారు. ట్వీట్టర్ వేదిక‌గా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్.. 'మీరు చేయ‌ని నేరానికి జైలు పాల‌య్యారు. జైలుకు వెళ్లేందుకు కార‌ణ‌మైన వారంద‌రినీ క్షమించండి. రోజూ మీ కోస‌మే ఎదురుచూస్తున్నా. నాకు స్టేజ్-2 క్యాన్సర్ అని తేలింది. మీ కోసం నేను ఇంకా ఎంతో కాలం వేచి ఉండ‌లేను ' అని ట్వీట్ చేశారు. కాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1988లో జరిగిన రోడ్డు వివాదంలో సిద్దూ ఒక వ్యక్తి పై దాడి చేయడంతో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయ‌న పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. అతను 2018లో రూ.వేయి చిన్న జరిమానాతో విడిచిపెట్టనా.. అనంతరం కేసు అనూహ్యంగా సుప్రీంకోర్టుకు చేరడంతో జైలు శిక్ష అనుభవించాల్పి వచ్చింది.

Advertisement

Next Story