Kerala: కేరళలో రూ. 17 కోట్ల స్కామ్ చేసి పారిపోయిన కేరళ బ్యాంక్ మేనేజర్

by S Gopi |
Kerala: కేరళలో రూ. 17 కోట్ల స్కామ్ చేసి పారిపోయిన కేరళ బ్యాంక్ మేనేజర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో ఓ బ్యాంక్ మేనేజర్ కోట్లాది రూపాయలు స్కామ్ చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వడకర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ మేనేజర్ ఈ మోసానికి పాల్పడ్డాడు. ఇదే బ్రాంచ్‌కు వచ్చిన కొత్త మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం నకిలీ బంగారమని గుర్తించిన కొత్త మేనేజర్ ఇర్షాద్, దానిపై సమీక్ష జరపడంతో పెద్ద స్కామ్ బయటపడింది. దాంతో ఇర్షాన్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. తమిళనాడుకు చెందిన మధు జయకుమార్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్‌కు మేనేజర్‌గా పనిచేశారు. ఇటీవలే అతను కొచ్చిలోని శాఖను బదిలీ అయ్యాడు. మధు బదిలీ అనంతరం వడకర బ్రాంచ్‌కు ఇర్షాద్ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఇర్షాద్ కొచ్చి బ్రాంచ్‌లో చేరలేదు. ఇదే సమయంలో వడకర బ్రాంచులో ఉన్న తాకట్టు బంగారం నకిలీదని ఇర్షాద్ గుర్తించారు. మొత్తం తాకట్టు పెట్టిన 26 కిలోల బంగారం నకిలీదని, దాని విలువ రూ. 17 కోట్లని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మధు జయకుమార్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో అతని ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో మోసం చేయడం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవదని పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. వడకర బ్రాంచులోని సిబ్బంది మొత్తం వద్ద నుంచి పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed