సివిల్స్‌లో ‘నకిలీ’లలు.. నలుగురు అభ్యర్థుల మధ్య వివాదం

by Vinod kumar |
సివిల్స్‌లో ‘నకిలీ’లలు.. నలుగురు అభ్యర్థుల మధ్య వివాదం
X

న్యూఢిల్లీ: ఈసారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఫలితాల్లో విచిత్ర వివాదం తలెత్తింది. ఇద్దరు ‘తుషార్’లు, ఇద్దరు ‘ఆయషా’లు ఒకే ర్యాంకును క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ల హాల్ టికెట్ నెంబర్లు కూడా ఒకటే కావడం విచిత్రంగా ఉంది. హర్యానాలోని రేవరి జిల్లాకు చెందిన తుషార్ కుమార్ 44వ ర్యాంకు సాధించినట్లు చెప్పుకున్నాడు. తనకూ అదే ర్యాంకు వచ్చిందని బిహార్ లోని భగల్పూర్ కు చెందిన తుషార్ కుమార్ కూడా అంటున్నాడు.

ఇద్దరి అడ్మిట్ కార్డు నెంబర్లు ఒకటే కావడం ఆశ్చర్యంగా ఉంది. తానే అసలైన అభ్యర్థిని అంటూ ఇద్దరూ తమ జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ కే చెందిన ఇద్దరు ‘ఆయషా’లు కూడా తమకు 184వ ర్యాంక్ వచ్చిందని క్లెయిమ్ చేస్తున్నారు. వీరిద్దరి అడ్మిట్ కార్డు నెంబర్లు కూడా ఒకటే. దేవాస్ జిల్లాకు చెందిన ఆయషా ఫాతిమా, అలిరాజ్ పూర్ జిల్లాకు చెందిన ఆయషా మక్రాని కూడా తమ జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

ఆ ఇద్దరిపై క్రిమినల్ చర్యలు..

ఈ వివాదంపై నిశితంగా విచారణ జరిపిన యూపీఎస్సీ అధికారులు హర్యానాకు చెందిన తుషార్ కుమార్, మధ్యప్రదేశ్ కు చెందిన ఆయషా మక్రానీల వాదనలను నకిలీవిగా నిర్ధారించారు. ఈ ఇద్దరు తమ వాదనలను బలపరచడానికి నకిలీ పత్రాలను చూపిస్తున్నారని చెప్పారు. యూపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈ ఇద్దరిపై క్రిమినల్, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. యూపీఎస్సీ వ్యవస్థ పటిష్టమైనదని, లోపాలకు అవకాశమే లేదని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed