Sathyabama University: కాలేజా బ్యారేజా?.. వరద నీటిలో చెన్నై సత్యభామ యూనివర్సిటీ

by Prasad Jukanti |
Sathyabama University: కాలేజా బ్యారేజా?.. వరద నీటిలో చెన్నై సత్యభామ యూనివర్సిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలు తమిళనాడు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో చెన్నెతో సహా పరిసర జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెన్నై నీట మునగగా నగంలోని ప్రముఖ సత్యభామ యూనివర్సిటీలో వరదల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడలోతు నీళ్లలో నుంచి బయటపడేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తేలియాడే పరుపులపై తమ వస్తువులను పెట్టుకుని క్యాంపస్ నుంచి వెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఇది కాలేజీనా లేక బ్యారేజీనా అని కామెంట్స్ చేయగా విద్యార్థుల విన్యాసాలు చూస్తుంటే ఇది కాలేజీనా లేక మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలోనూ సత్యభామ యూనివర్సిటీని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో యాజమాన్యం నాటు పడవలతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. తాజాగా మరోసారి వర్షాలు దంచికొడుతుంటే వరద నీటితో విద్యార్థులు వణికిపోతున్నారు.


Advertisement

Next Story