వేగంగా వ్యాపిస్తున్న ‘చాందిపుర’..గుజరాత్‌లో మరో ఐదు కేసులు నమోదు!

by vinod kumar |
వేగంగా వ్యాపిస్తున్న ‘చాందిపుర’..గుజరాత్‌లో మరో ఐదు కేసులు నమోదు!
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో చాందిపుర వైరస్ కేసులు కలకం రేపుతున్నాయి. తాజాగా సబర్ కాంత జిల్లాలో మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ‘ఇప్పటి వరకు, ఆస్పత్రిలో 14 చాందిపుర వైరస్ కేసులు నమోదు కాగా.. వీరిలో చనిపోయారు. అలాగే హిమ్మత్‌నగర్ ఆస్పత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు’ అని సబర్‌కాంత జిల్లా ఆరోగ్య అధికారి రాజ్ సుతారియా తెలిపారు. గడచిన 24 గంటల్లో హిమ్మత్‌నగర్‌లో మొత్తం ఐదుగురు చిన్నారులకు చండీపురా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. కాగా, గుజరాత్‌లో చాందిపురా వైరస్ బారిన పడి మొదటి సారిగా నాలుగేళ్ల బాలిక మరణించిన విషయాన్ని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో వైరస్ పరిస్థితి, దాని నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మరోవైపు పొరుగున ఉన్న రాజస్థాన్‌లోనూ చాందిపుర కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed