నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప వాయించిన మత్స్యకారుడు

by Prasad Jukanti |
నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప వాయించిన మత్స్యకారుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారనో మరో కారణాలతోనే ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చూసిన ఓ ప్రేమ జంటకు వింత అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ లోని గోమతి నదిలో ఓ ప్రేమ జంట దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వారి పనిని గమనించిన అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. అయితే ఒడ్డుకు చేరుకున్నాక సదరు మత్స్యకారుడు ప్రియుడి చెంప చెల్లుమనిపించాడు. జీవితం ఎంత విలువైందో చెబుతూ మూడు నాలుగు సార్లు చెంపవాయించాడు. దీంతో బిత్తరపోయిన సదరు యువకుడు మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనలో ఈ ప్రేమ జంట ప్రాణాలకు ముప్పేమి లేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story