Patanjali : పతంజలికి చెందిన మరో ఉత్పత్తిపై హైకోర్టులో పిటిషన్

by Hajipasha |   ( Updated:2024-08-30 16:58:07.0  )
Patanjali : పతంజలికి చెందిన మరో ఉత్పత్తిపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : పతంజలి ఆయుర్వేద కంపెనీకి చెందిన మరో ఉత్పత్తి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ‘దివ్య దంత్ మంజన్’‌ను శాకాహార ఉత్పత్తి అంటూ బ్రాండింగ్ చేయడాన్ని అభ్యంతరం తెలుపుతూ యతిన్ శర్మ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ప్రోడక్ట్స్‌లో సముద్రఫెన్ అనే చేపలకు సంబంధించిన మూలాలను వాడారని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు ‘దివ్య దంత్ మంజన్’‌ను శాకాహార ఉత్పత్తిగా ఎలా బ్రాండింగ్ చేస్తారని సదరు పిటిషనర్ ప్రశ్నించారు.

మతవిశ్వాసాల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు శాకాహారం మాత్రమే తింటామని.. ‘దివ్య దంత్ మంజన్’‌లో చేప మూలాలు ఉన్నాయని తెలిసి చాలా కలత చెందామని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed