Firing incidents: ఈశాన్య ఢిల్లీలో కాల్పుల కలకలం.. పది నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలు

by vinod kumar |
Firing incidents: ఈశాన్య ఢిల్లీలో కాల్పుల కలకలం.. పది నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ఢిల్లీ (North east Delhi)లో కాల్పులు కలకం రేపాయి. పది నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్ నగర్ (Kabeer nagar) ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నదీమ్, అతని స్నేహితుడు షానవాజ్‌లు శనివారం తెల్లవారుజామున బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నదీమ్ ప్రాణాలో కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో మూడు ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కానీ కాల్పులు జరపడానికి గల కారణాలు వెల్లడించలేదు. అనంతరం ఈ ఘటన జరిగిన 10 నిమిషాల వ్యవధిలోనే జ్యోతినగర్ (Jyothi nagar) ప్రాంతంలో దుండగులు ఓ ఇంటిపై కాల్పులకు తెగపడ్డారు. అయితే రెండో ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed