హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 40 మంది కార్మికులు

by S Gopi |
హర్యానా రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 40 మంది కార్మికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని సోనిపత్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రబ్బర్ బెల్ట్ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో కొంతమందికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్ల నుంచి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో 40 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాదం గురించి విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో మంటలను అదుపుచేసే ప్రక్రియను వేగవంతంగా చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న కార్మికుల్లో కొందరినీ రక్షించారు. ప్రస్తుతానికి మంటలు వ్యాపించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో రబ్బదు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్టు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడిన 16 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

Advertisement

Next Story