ఇంట్లో అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు సజీవ దహనం

by vinod kumar |   ( Updated:2024-06-13 08:39:18.0  )
ఇంట్లో అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు సజీవ దహనం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సరిహద్దు ప్రాంతం బెహతా హాజీపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం కాగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలోని రెండతస్తుల నివాస భవనంలో బుధవారం అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న వారంతా అందులోనే చిక్కుకుపోయారు. దీంతో బయటకు రావడానికి వీలు లేకపోవడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మరణించారు.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా..వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృత దేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయని నిర్థారించారు. ఇంట్లో నిల్వ ఉంచిన థర్మాకోల్, ఫోమ్ మెటీరియల్‌కు మంటలు అంటుకోవడంతో వేగంగా వ్యాపించాయని వెల్లడించారు. మృతులను నజ్రా(26) ఆమె కుమార్తె ఇక్రా (7), షైఫుల్ రెహ్మాన్ (35), మహ్మద్ ఫైజ్ (7), పర్వీన్ (28)గా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed