ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

by GSrikanth |
ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి అలీపూర్‌ ప్రాంతంలోని పెయింట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడి పక్కనున్న ఇళ్లు, షాపులకు వ్యాపించాయి. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి 22 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.

మంటల్లో చిక్కుకున్న మరి కొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పరిశ్రమలోని రసాయనాలే పేలుడు కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా, దేశ రాజధాని నగరాన్ని తరుచూ జరుగుతోన్న అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed