Fire Accident : పూణేలో భారీ అగ్నిప్రమాదం.. పలు దుకాణాలు దగ్ధం..!

by Maddikunta Saikiran |
Fire Accident : పూణేలో భారీ అగ్నిప్రమాదం.. పలు దుకాణాలు దగ్ధం..!
X

దిశ, వెబ్‌డెస్క్: పూణేలోని పింప్రి చించ్‌వాడ్‌లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అనేక ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. మంటలను అదుపు చేసేందుకు , చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కృషి చేస్తున్నారు.అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకపోయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed