Mithun Chakraborty : నటుడు మిథు‌న్ చక్రవర్తిపై కేసు

by Hajipasha |   ( Updated:2024-11-06 12:30:35.0  )
Mithun Chakraborty : నటుడు మిథు‌న్ చక్రవర్తిపై కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ నేత, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty)పై కోల్‌కతాలోని విధాన్ నగర్ సౌత్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అక్టోబరు 27న బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన బీజేపీ(BJP) సభలో మిథున్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. ‘‘2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధికార పీఠం బీజేపీకి కైవసం అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏమేం చేయాలో అవన్నీ బీజేపీ శ్రేణులు చేసి తీరుతాయి’’ అని మిథున్ వ్యాఖ్యానించారు.

బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. మమతా బెనర్జీ సర్కారు కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే మిథున్‌పై కేసు బనాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఆరోపించారు. మిథున్ ప్రసంగంలో రెచ్చగొట్టే అంశమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed