'ఇద్ద‌రు యువ‌రాజు'ల సినిమాను ప్రజలెప్పుడో తిరస్కరించారు: మోదీ సెటైర్లు

by S Gopi |
ఇద్ద‌రు యువ‌రాజుల సినిమాను ప్రజలెప్పుడో తిరస్కరించారు: మోదీ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఎండ వేడితో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా వాడీవేడిగా జరుగుతోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. యూపీలోని అమ్రోహాలో జరిగిన ర్యాలీ సందర్భంగా మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై సెంటర్లతో విరుచుకుపడ్డారు. వారిద్దరినీ ఉద్దేశిస్తూ.. గతంలో ఇద్దరు యువరాజులు నటించిన సిమానను ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి యూపీ ప్రజలను బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల ద్వారా ఓట్లు అడిగేందుకు వస్తారని విమర్శించారు. ప్రచారం చేస్తున్నప్పుడు మన మత విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎలాంటి అవకాశాన్నైనా వదులుకోరని ఆరోపణలు చేశారు. 'మరోసారి ఇద్దరు యువరాజులు నటించిన సినిమా షూటింగ్ యూపీలో జరుగుతోంది. ఇప్పటికే యూపీ ప్రజలు వారి సినిమాను తిరస్కరించారు. ప్రతిసారి వారు బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులతో యూపీ ప్రజలను ఓట్లు అడగడానికి బయలుదేరారని మోడీ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భారత్ మాతాకీ జై అనడానికి కూడా ఇబ్బంది పడతారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టకు ఆహ్వానిస్తే కాంగెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తిరస్కరించాయని మోడీ ప్రస్తావించారు. దేశం మొత్తం రాముడి భక్తితో నిండిపోయిన సమయంలో, ఎస్పీ పార్టీ వర్గాలు రామభక్తులను బహిరంగంగానే కపటులుగా పిలిచారని మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story