- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దమ్ముంటే నిర్మల, జైశంకర్‌లను పోటీకి దింపండి.. బీజేపీకి అన్నా డీఎంకే నేత సవాల్
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీపై అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుసామి సెటైర్స్ పేల్చారు. తమిళనాడులో బీజేపీకి మద్దతు పెరిగిందని భావిస్తే.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్‌లను రాష్ట్రంలోని ఏదైనా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని సవాల్ విసిరారు. తమిళనాడుకు చెందిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని బీజేపీకి మునుసామి సూచించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు తన సవాల్‌ను స్వీకరించాలని కోరారు. ‘‘బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే.. తమిళ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే.. ఈ ఇద్దరు మంత్రులను తమిళనాడులోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి దింపాలి’’ అని మునుసామి కోరారు. రాష్ట్రంలో ఈ మంత్రులను పోటీకి నిలిపితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. నిర్మలా సీతారామన్ సహా రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్ర మంత్రులను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని బీజేపీ యోచిస్తోందన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో అన్నాడీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తమిళనాడు సహా ఏదైనా ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి నిర్మలా సీతారామన్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.