- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : అసంపూర్తిగా ఫీలయ్యా.. కశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటుపై రాహుల్‌గాంధీ కామెంట్
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోదా లేకుండానే కశ్మీరులో ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని తాను అసంపూర్తిగా ఫీలయ్యానని ఆయన పేర్కొన్నారు. కశ్మీరు ప్రజల నుంచి ప్రజాస్వామ్యాన్ని కేంద్ర సర్కారు లాక్కుందని రాహుల్ మండిపడ్డారు. రాష్ట్ర హోదాను సాధించే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
‘‘రాహుల్‌కు నా థ్యాంక్స్. సీఎంగా నా ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర హోదాను సాధించేందుకు కశ్మీరీలు సాగించే పోరాటానికి మీ నిరంతర మద్దతు అవసరం’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు కశ్మీరీలకు నా అభినందనలు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఒమర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు.