పంట నష్ట పరిహారం కోసం రైతుల వినూత్న నిరసన

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 06:13:29.0  )
పంట నష్ట పరిహారం కోసం రైతుల వినూత్న నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: పంట నష్ట పరిహారం కోసం రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పంట నష్ట పరిహారం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయ రుణమాఫీ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పంజాబ్ రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 18 టోల్ ప్లాజాల వద్ద అన్నదాతలు నిరసన తెలిపారు. వాహనాల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. గురువారం మొదలైన ఈ ఆందోళన వచ్చే నెల 15 వరకు రాత్రి పగలు కొనసాగుతుందని తెలిపారు. కాగా పంజాబ్ కు చెందిన ద కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్సీ) ఈ ఆందోళనకు సారధ్యం వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను తెచ్చిన తర్వాత ఢిల్లీలో పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. మళ్లీ తమ రాష్ట్రంలో ఈ ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ తాజా ఆందోళనలు సవాల్‌గా మారాయి.

Also Read....

Jodo Yatra: గాంధీతో పోల్చడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed