వైరల్ వీడియో : పోలీసు డ్రోన్లు వర్సెస్ రైతుల గాలిపటాలు.. ఢిల్లీ బార్డర్‌లో ఉద్రిక్తత

by Hajipasha |
వైరల్ వీడియో : పోలీసు డ్రోన్లు వర్సెస్ రైతుల గాలిపటాలు.. ఢిల్లీ బార్డర్‌లో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీకి చెందిన పంజాబ్ - హర్యానా బార్డర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను కట్టడి చేసేందుకు అన్ని రకాల మార్గాలను ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అనుసరిస్తున్నాయి. పోలీసులు డ్రోన్ల ద్వారా రైతులపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను జార విడుస్తున్నారు. ఈక్రమంలో బుధవారం రోజు పోలీసుల డ్రోన్లను రైతులు తమదైన శైలిలో ఎదుర్కొన్నారు. డ్రోన్‌లకు దగ్గరగా పలువురు రైతులు గాలిపటాలను ఎగురవేశారు. తమ గాలిపటాలను ఉపయోగించి డ్రోన్లను గాలిలోనే అడ్డుకోవడానికి యత్నించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు ‘చలో ఢిల్లీ’ మార్చ్‌‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలవారీ రూ.10,000 పెన్షన్, రైతు రుణమాఫీ, రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని అన్నదాతల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Advertisement

Next Story