- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Farmers: డిసెంబర్ 6న ఢిల్లీ మార్చ్.. రైతు సంఘాల ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: పంటలకు కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్దమైన హామీతో పాటు రైతులకు సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ వైపుగా పాదయాత్ర చేస్తామని హర్యానాలోని శంభు సరిహద్దులో సమ్మె చేస్తున్న రైతులు ప్రకటించారు. చండీగఢ్‌లో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM)ల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేఎంఎం నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఫైర్ అయ్యారు.
శంభు సరిహద్దు (Shambu barder) నుంచే విడతల వారీగా ఢిల్లీకి బయలు దేరతామని చెప్పారు. 9 నెలలుగా రైతులు మౌనంగా కూర్చున్నామని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆందోళనను ఉధృతం చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, గతంలో రైలు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కు పిలుపునివ్వగా భద్రతా బలగాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 13 నుంచి రైతులు శంభూ బార్డర్‌లో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్దమైన హామీతో పాటు వ్యవసాయ రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్, గత నిరసనల్లో భాగంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటివి నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.