అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

by samatah |   ( Updated:2024-05-26 11:16:25.0  )
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత మరోసారి హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోడీ గత పదేళ్లలో 22 మందికి రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అయితే గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన విపత్తును ఎదుర్కోవడానికి రూ.9,000 కోట్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. అంతేగాక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించారని విమర్శించారు.

ఆపిల్ ధరలను నియంత్రించడానికి మోడీ ఒక వ్యక్తికి అన్ని నిల్వల సౌకర్యాలను అప్పగించారన్నారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీకి చెందిన కంపెనీల షేర్ల ధరలు మాత్రమే పెరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి బీజేపీ నేతలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ హయాంలో మీడియా సైతం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు పెహ్లీ నౌక్రీ పక్కి అధికార్ కార్యక్రమం కింద ఏడాదిలోపు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అంతేగాక దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read More..

భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు: రాజ్‌నాథ్ సింగ్

Advertisement

Next Story

Most Viewed