'నకిలీ శివసేన'.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్

by Dishanational1 |
నకిలీ శివసేన.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర శివసేన(యూబీటీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. నకిలీ శివసేన నాయకులు తనను ఓడిస్తామని కలలు కంటున్నారు, తనను సజీవ సమాధి చేయాలని మాట్లాడుతున్నారు. తనను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో పోల్చిన శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై మోడీ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు నేను బతికున్నప్పుడు లేదా చనిపోయిన తర్వాత కూడా నన్ను పాతిపెట్టలేరని మోడీ అన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన ప్రధాని మోడీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్), శివసేనలపై సెటైర్లు వేశారు. రెండు డూప్లికేట్ పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించకుండా మోడీ ఆయనను విమర్శించారు. 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్‌లో తన పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేనలు రెండిటీ ఉద్దేశం ఇదే. కాంగ్రెస్‌లో విలీనం తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మారే బదులు అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండేలతో చేతులు కలిపితే బాగుంటుందని వ్యంగ్యంగా మాట్లాడారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed