Eknath Shinde : రాజ్యాంగం మార్పు పేరుతో భయపెట్టారు.. విపక్షాలపై మహారాష్ట్ర సీఎం షిండే విమర్శలు

by Hajipasha |
Eknath Shinde : రాజ్యాంగం మార్పు పేరుతో భయపెట్టారు.. విపక్షాలపై  మహారాష్ట్ర సీఎం షిండే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల టైంలో విపక్ష పార్టీలు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని మహారాష్ట్ర సీఎం, శివసేన (షిండే) చీఫ్ ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకిి రాగానే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందనే విపక్షాల దుష్ప్రచారాన్ని విని, నిజమే అని భావించి ప్రజలు భయం నీడలో కాలాన్ని వెళ్లదీశారని ఆయన చెప్పారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాబాసాహెబ్ రాజ్యాంగం కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘మోడీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లను తీసేస్తారనే విపక్షాల వదంతిని విని సమాజంలోని చాలా వర్గాల ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు’’ అని షిండే తెలిపారు.

‘‘ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయనే వ్యాఖ్యలు చేయడం అనేది నెగెటివ్ అయింది. వాటిని విని కూటమిలోని పార్టీల క్యాడర్‌ కొంత రిలాక్స్ అయ్యారు. కొంతమంది నాయకుల తప్పుడు కామెంట్స్ వల్ల కూడా నష్టం జరిగింది’’అని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపైనే ఫోకస్ ఉంటుంది.. లోక్‌సభ ఎన్నికల్లో మాట్లాడిన విషయాలను ఇప్పుడు ప్రస్తావించం’’ అని ఆయన స్పష్టం చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచి మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల మహా వికాస్ అఘాడీ కూటమి పాలనలో పూర్తి విఫలమైందని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed