Himachal: నకిలీ ఆయుష్మాన్ భారత్ ఐడీ కేసులో అవినీతిని తీవ్రంగా పరిగణించాలి: హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

by S Gopi |
Himachal: నకిలీ ఆయుష్మాన్ భారత్ ఐడీ కేసులో అవినీతిని తీవ్రంగా పరిగణించాలి: హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ ఆయుష్మాన్ భారత్ ఐడీ కార్డుల తయారీకి సంబంధించి అవినీతి ఆరోపణలు, అనేక ఆసుపత్రులు పథకాన్ని ఉల్లంఘించిన విషయం నిజమైతే అది తీవ్రమైనదని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ఎస్ బాలి అన్నారు. బుధవారం కాంగ్రా జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో ఈడీ దాడుల తర్వాత ఆర్ఎస్ బాలి శుక్రవారం ధర్మశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన నివాసం, ఆసుపత్రిలో దాడుల గురించి ఆయన వివరించారు. 'ఆయుష్మాన్ భారత్ పథకం పేరున అవినీతి జరిగితే అది చాలా తీవ్రమైన విషయం. ఈ పథకంలో ప్రజాధనం మిళితమై ఉంటుంది. ఆసుపత్రులు మోసాలకు పాల్పడితే దర్యాప్తు సంస్థలు తమ పనిని నిర్వహించవచ్చు. ఒకవేళ మోసం జరిగి ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. ఈడీ దాడులకు సహకరించామని, అది తన ప్రథమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, అలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. జూలై 31న నకిలీ ఆయుష్మార్ భారత్ ఐడీ కార్డుల తయారీ, ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఆర్ఎస్ బాలి, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సఖు సన్నిహితుడికి చెందిన 19 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అనేక ఆసుపత్రులు, అధికారులు భాగస్వామ్యమైనట్టు సమాచారం. ఢిల్లీ, చడీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో దాడులు నిర్వహించారు.

Advertisement

Next Story