- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘సనాతన ధర్మం’ గురించి ఇక చెప్పాల్సింది బీజేపీయే : డీఎంకే
దిశ, నేషనల్ బ్యూరో : ‘సనాతన ధర్మం’ అంశంపై బీజేపీని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే లక్ష్యంగా ఎంచుకుంది. సనాతన ధర్మం అంటే ఏమిటో వివరించాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ బీజేపీకి హితవు పలికారు. ఈవిషయంపై మాట్లాడేందుకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు ముందుకు రావడం లేదన్నారు. ‘‘ సనాతన ధర్మంపై మాట్లాడినందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రిపదవి నుంచి తప్పించకూడదని మద్రాస్ హైకోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో మనకు అర్థమయ్యేది ఒక్కటే. సనాతన ధర్మమే మనుధర్మం. ఒకవేళ అది మనుధర్మం కాదని బీజేపీ వాళ్లకు మేం చెప్పినా .. దానికి వ్యతిరేకత వెల్లువెత్తుతుంది’’ అని డీఎంకే నేత ఇళంగోవన్ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్ బాబు, డీఎంకే ఎంపీ ఏ రాజాలపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ ఇటీవల కో వారెంటో జారీ చేయడం మానుకున్నారు. దీంతోపాటు హిందూ మున్నాని ఆర్గనైజేషన్ ఆఫీస్ బేరర్లు దాఖలు చేసిన కో వారెంటో పిటిషన్లపైనా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.