ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కసరత్తు.. ప్రధాని అధ్యక్షతన ఈ నెల15న సమావేశం!

by Shiva |   ( Updated:2024-03-11 07:29:56.0  )
ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కసరత్తు.. ప్రధాని అధ్యక్షతన ఈ నెల15న సమావేశం!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయగా.. శుక్రవారం మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15లోపు కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ తొలుత ఒక్కో పోస్టుకు ఐదుగురి పేర్లతో వేర్వేరు జాబితాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్‌గా ఎంపిక చేయనున్నారు.

Advertisement

Next Story