లోక్ పాల్ చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్‌ నియామకం

by S Gopi |
లోక్ పాల్ చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్‌ నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌ను భారత రాష్ట్రపతి అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్ పాల్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్‌పాల్ జ్యుడిషియల్‌ సభ్యులుగా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ లింగప్ప నారాయణస్వామి, జస్టిస్‌ సంజయ్ యాదవ్, జస్టిస్‌ రుతురాజ్ అవస్థీలను నియమించగా, నాన్-జ్యుడిషియల్ సభ్యులుగా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీలు నియమించబడ్డారు. లోక్ పాల్ అంబుడ్స్‌మెన్ కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులపై దృష్టి పేడుతుంది. 2022, మేలో భారత తొలి లోక్‌పాల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బాధ్యతలు పూర్తయిన తర్వాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా సంస్థలోని జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Next Story