కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. సీబీఐ అదుపులో మాజీ మంత్రి

by Shamantha N |
కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. సీబీఐ అదుపులో మాజీ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: క‌ర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బి నాగేంద్ర‌ను వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండ్రోజులుగా మాజీ మంత్రి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ.. శుక్రవారం ఆయన్ని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లింది. మ‌హ‌ర్షి వాల్మీకి ఎస్టీ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్‌లో జ‌రిగిన స్కామ్‌తో లింకున్న కేసులో నాగేంద్ర‌ను విచారిస్తున్నారు. కార్పొరేష‌న్‌కు చెందిన యూనియ‌న్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న సుమారు 89.9 కోట్ల డ‌బ్బును.. వివిధ గుర్తింపు లేని అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. యూనియన్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. రెండ్రోజుల నుంచి డాల‌ర్స్ కాల‌నీలో ఉన్న ఇంటి నుంచి నాగేంద్ర‌ను ఈడీ అధికారులు బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌లేదు. ఆయ‌న్ను ప్ర‌శ్నించేందుకు ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ ద‌డ్డాల్ నివాసంలో కూడా సోదాలు జ‌రిగాయి. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేసిన ముగ్గురు మాజీ ఉద్యోగుల ఇళ్లను కూడా అధికారులు త‌నిఖీ చేశారు.

అధికారి ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన కుంభకోణం

మే 21న వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ ఆత్మహత్య తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖరన్ రాసిన సూసైడ్ నోట్ లో పలువురు అధికారులు కార్పొరేషన్ ఖాతాల నుండి అనేక ఇతర బ్యాంకు ఖాతాలకు అక్రమ నగదు బదిలీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ఈ కేసులో యూనియన్ బ్యాంకు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న బి. నాగేంద్ర జూన్ 6న మంత్రిపదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను అరెస్టు చేసింది.

Advertisement

Next Story

Most Viewed