- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి యేటా 400 మావోయిస్టుల లొంగుబాటు.. ఇన్ ఫార్మర్ల నెపంతో 1700 మంది హత్య!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పునరావాస విధానం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి సంవత్సరం 400 మందికి పైగా మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోతున్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్‌రాజ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయంతో పాటు స్థిరమైన ఉపాధి, ఉద్యోగ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. హింసను విడనాడి జన స్రవంతిలో కలిసిపోయేలా మావోయిస్టులను ప్రోత్సహించేందుకు దంతెవాడ జిల్లాలో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నామని దీని ఫలితాలు చాలా బాగున్నాయన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీపీఐ మావోయిస్టు సంస్థలో ఎక్కువ మంది నాయకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఛత్తీస్‌గఢ్ వెలుపలి రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని వీరంతా ఛత్తీస్ గఢ్‌లోని స్థానిక యువకులు, మహిళలను జల్, జంగిల్, జమీన్ పేరుతో బలవంతంగా తప్పుదోవ పట్టించారన్నారు. గత 22 ఏళ్లలో ఇన్ ఫార్మర్లనే నెపంతో 1700 మందిని హత్య చేశారని మావోయిస్టుల వాస్తవిక పరిస్థితిని తెలుసుకున్నాక అనేక మంది యువత ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నారని తెలిపారు. త్వరలోనే మిగతా మావోయిస్టు కార్యకర్తలు హింసను విడనాడి సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరిపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు.