- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలిటికల్ ఎంట్రీపై ప్రియాంక గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని వాద్రా చెప్పారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ కోసం పడుతున్న కష్టాన్ని జనం గుర్తించారని అందుకే యావత్ దేశ ప్రజలంతా గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూన్న బీజేపీని వదిలించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను 1999 నుండి అమేథీలో ప్రచారం చేస్తున్నాను. సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ తన వాగ్దానాలను నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు..
కాగా తాను అమెథీలో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాబర్ట్ వాద్రా ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో వాద్రాకు మద్దతుగా పార్టీ కార్యాలయం వద్ద అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలని కోరుకుంటున్నారు అని పోస్టర్లు సైతం వెలిసిన సంగతి తెలిసిందే. కాగా అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న వేళ రాబర్ట్ వాద్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.