‘పద్మశ్రీ’ అందుకోకుండానే సంగీత విద్వాంసుడు కన్నుమూత

by GSrikanth |
‘పద్మశ్రీ’ అందుకోకుండానే సంగీత విద్వాంసుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సంగీత సమాజంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్(93) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్‌కు చెందిన లక్ష్మణ్ భట్.. జీవితమంతా సంగీత సాధనకే అంకితం చేశారు. ఎంతో మందికి ఉచితంగా నేర్పించారు. దీంతో ఆయనకు గత నెల 25న కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పద్మ అవార్డును అందుకోకుండానే ఆయన మరణించారు. కాగా, ఆయన కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తి, కూడా సంగీత కళాకారులుగా అదే రంగంలో కొనసాగుతున్నారు. కేంద్రం లక్ష్మణ్ భట్‌కు ప్రకటించిన పద్మ అవార్డును ఆయన కూతుర్లు అందుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed