- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Elon musk: మైక్రోసాఫ్ట్ కంటే మైక్రో హార్డ్ బెటర్.. ఎలన్ మస్క్ సెటైరికల్ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇండిగో, అకాసా, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు తమ సేవలను ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ కావడం తో అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే లండన్ స్టాక్ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం కలిగింది. ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కారణంగా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా రంగాల్లో తీవ్ర ఇబ్బంది నెలకొంది. దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. మైక్రోసాఫ్ట్ కంటే మైక్రో హార్డ్ బెటర్ అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు అన్ని యాప్‌లు నిలిచిపోయినా.. ట్విట్టర్ మాత్రం పనిచేస్తుందంటూ మస్క్ మరో ట్వీట్ చేశాడు.