Elon Musk: డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు.. స్టార్ లింక్ హెల్ప్ కోరనున్న అండమాన్ పోలీసులు !

by vinod kumar |
Elon Musk: డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు.. స్టార్ లింక్ హెల్ప్ కోరనున్న అండమాన్ పోలీసులు !
X

దిశ, నేషనల్ బ్యూరో: అండమాన్ నికోబార్ (Andaman nikobar) దీవుల పోలీసులు ఇటీవల మయన్మార్‌(Mayanmar) కు చెందిన ఆరుగురు పౌరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4.25 బిలియన్ డాలర్ల విలువైన మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిని లోతైన సముద్రంలో నావిగేట్ చేయడానికి, భారత జలాల్లోకి తీసుకురావడానికి స్మగ్లర్లు స్టార్‌లింక్‌(Star link)కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాన్ని ఉపయోగించారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మాదక ద్రవ్యాల స్మగ్లర్లను పట్టుకోవడానికి అండమాన్ పోలీసులు అమెరికా బిలియనీర్, స్టార్‌లింక్ యజమాని ఎలన్ మస్క్(Elon musk) సహకారం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.మొదటి సారిగా భారత జలాల్లోకి తరలించిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ల ఆచూకీ కోసం వివరాలను కోరనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ పరికరాన్ని ఎవరు కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, దాని వినియోగ చరిత్ర వంటి వివరాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. సీనియర్ పోలీసు అధికారి హరగోబిందర్ సింగ్ ధాలివాల్ (Dhaliwal) మాట్లాడుతూ.. స్మగ్లర్లు భారతీయ జలాల వద్దకు వస్తున్నప్పుడు మొదటిసారిగా లోతైన సముద్రంలో నావిగేట్ చేయడానికి శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఉపయోగించారని, కాబట్టి స్టార్‌లింక్ నుంచి వివరాలను కోరుతామని చెప్పారు. అయితే దీనిపై స్టార్ లింక్ స్పందించలేదు. కాగా, ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ అంతర్జాతీయ జలాల్లో ఇంటర్నెట్ కవరేజీని అందిస్తోంది. ఈ స్టార్‌లింక్‌ను భారతదేశంలోనూ ప్రారంభించాలని మస్క్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఘటన జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed