Surender Panwar: అక్రమ మైనింగ్ కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఈడీ

by Ramesh N |
Surender Panwar: అక్రమ మైనింగ్ కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఈడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. రెండు రోజుల పాటు కేంద్ర ఏజెన్సీ సోదాలు నిర్వహించిన తర్వాత పన్వార్‌ను గరుగ్రామ్‌లో నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సోనిపట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేందర్ పన్వార్ హర్యానా, రాజస్థాన్‌లలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కేసులు ఉన్నాయి. జ‌న‌వ‌రిలో ఓసారి ఈడీ అధికారులు ఎమ్మెల్యే పన్వార్‌ ఇంట్లో సోదాలు చేశారు.

ఇదే కేసులో గ‌తంలో ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్ ద‌ళ (ఐఎన్‌ఎల్‌డీ) ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌ను అరెస్టు చేశారు. కొండ‌లు, గుట్ట‌లు అక్ర‌మంగా తొవ్విన కేసులో హ‌ర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దీనిపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు పెట్టారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన కుమారుడిని కూడా విచారణకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ ఆరోపణలు సూచించే అనేక పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది.

కాగా, పన్వార్ 2019లో సోనిపట్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీకి చెందిన కవితా జైన్‌పై విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో సురేందర్ పన్వార్‌కు 59.51 శాతం ఓట్లు రాగా, కవితా జైన్‌కు 34.88 శాతం ఓట్లు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed