మోడీపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలం: సీపీఎం నేత బృందా కారత్ ఫైర్

by Dishanational2 |
మోడీపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలం: సీపీఎం నేత బృందా కారత్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మత పరమైన వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నప్పటికీ ఆయనపై ఎలక్షన్ కమిషన్(ఈసీ) చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం నాయకురాలు బృందా కారత్ ఫైర్ అయ్యారు. మోడీ భారతీయ చట్టాలను ఉల్లంఘించినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సంఘం పాత్ర సరిగాలేదని. మోడీ పై చర్యలు తీసుకోకపోతే ఈసీ విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఒక లౌకిక దేశమని..కానీ ప్రధాని ప్రసంగాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయిన తెలిపారు. ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకునేందుకు ఒక నిర్దిష్ట సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మొదట స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని దీంతో ఢిల్లీ కమిషనర్‌కు ఫిర్యాదును పంపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed