మహారాష్ట్రలో భూకంపం.. రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతగా నమోదు

by Shamantha N |   ( Updated:2024-07-10 07:52:07.0  )
మహారాష్ట్రలో భూకంపం.. రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించింది. హింగోలిలో కలమ్నూరి తాలూకాలోని రామేశ్వర్ తండాలో బుధవారం ఉదయం 7.14 గంటలకు భూకంపం వచ్చిందని నాందేడ్ జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. రిక్రారు స్కేలుపైన 4.5 తీవ్రతో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. నాందేడ్, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్, వాషిమ్ జిల్లాలోనూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్టి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదిక అందలేదన్నారు. ఇంటి కప్పులపై బరువు పెంచేందుకు పెట్టిన రాళ్లను తొలగించాలని నాందేడ్ జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఈ ఏడాది మార్చిలో హింగోలిలోని కల్మనూరి తాలూకాలోని జాంబ్ గ్రామంలో భూకంపం వచ్చింది. రిక్టారుస్కేలుపైన 4.5 తీవ్రతతో భూమి కంపించింది.

Advertisement

Next Story